
మరీ ముఖ్యంగా ఆ లిస్టులో మనం చెప్పుకోవాల్సింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి. పెద్ద హీరో మంచి ఆస్తిపాస్తులున్నాయి . ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ . పొలిటికల్ పరంగా కూడా సీనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే . అంత స్థాయిలో ఉన్న వ్యక్తికి కోపం వస్తే ఏదైనా చేయొచ్చు. ఏం చేసిన అడిగేవాడే లేడు . నువ్వు చేసింది రాంగ్ అని చెప్పేవాడే లేడు . కానీ ఎన్టీఆర్ మాత్రం తన కోపాన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవారట . యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన తన కోపాన్ని విచ్చలవిడిగా చూపించేసేవారట.
నోటికొచ్చిన బూతు పదాలు తిట్టడం పక్కన ఉన్న వస్తువు పగలగొట్టడం ..ఇలా చేసేవారట . కానీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ తన కోపాన్ని ఎప్పుడు ఎలా చూపించాలి ..ఎలా దెబ్బ కొట్టాలి అన్న విధంగానే ముందుకు తీసుకెళ్లారట . మరి ముఖ్యంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొత్త పద్ధతిని ఆయనకు ఆయనే అలవాటు చేసుకున్నారట. కోపం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నెంబర్స్ ని రివర్స్ కౌంటింగ్ చేసేవారట. ఇది చాలామంది డాక్టర్స్ చెప్పే పద్ధతే. కోపం వచ్చినా ఆవేశం వచ్చినా మనల్ని మనం కంట్రోల్ చేసుకుని సిచువేషన్ నుంచి అవుట్ అయిన..ఆ సిచువేషన్ నుంచి బయటపడాలి అంటే రివర్స్ నెంబర్ కౌంటింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అంటూ ఎంతోమంది డాక్టర్స్ ఈ మధ్యకాలంలో చెప్పుకొచ్చారు.
అయితే అది ఎప్పుడో సీనియర్ రామారావు గారు అలవాటు చేసుకున్నారు . మరి ముఖ్యంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఈ రివర్స్ కౌంటింగ్ పద్ధతిని ఎక్కువగా ఫాలో అయ్యేవారట . కోపం వచ్చినప్పుడు ఎవరైనా టంగ్ స్లిప్ అవుతారు . కానీ ఆ తర్వాత ఆ మాటలు అన్నామే అని బాధపడతారు. అలా తప్పు జరగకుండా ఉండాలి అంటే అది కూడా బాధ్యతగల పొజిషన్లో ఉన్న వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఇలా రివర్స్ కౌంటింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు జనాలు.