సినిమా ఇండస్ట్రీలో లేటు వయసులో ఘాటు ప్రేమలు అనేవి చాలా కామన్.. ఇప్పటికే చాలామంది నటీనటులు 60, 70 ఏళ్ల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు.కొంతమందికి రెండుసార్లు మూడుసార్లు పెళ్లిళ్లు అయినా కూడా నాలుగో పెళ్లి చేసుకోవడానికి అస్సలు వెనకడుగు వేయరు. అలాంటి వారిలో తాజాగా ఈ టాలీవుడ్ విలన్ కూడా చేరారు. 60 ఏళ్ల వయసులో దాదాపు తనకంటే వయసులో పదేళ్లు చిన్నదైనా మహిళను పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించారు.మరి ఇంతకీ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఆ టాలీవుడ్ విలన్ ఎవరు.. మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఈయన ఒకప్పుడు తెలుగు, తమిళ,కన్నడ, హిందీ భాషల్లో ఫేమస్ విలన్..

 కానీ ప్రస్తుతం హీరోలే విలన్ రోల్స్ చేయడంతో తండ్రి పాత్రల్లో చేస్తున్నారు. ఇక సినిమాల్లో బిజీగా లేని సమయంలో పలు రాష్ట్రాలు,దేశాలు తిరుగుతూ ఫుడ్ వ్లాగర్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పలు దేశాలలో ఉన్న ఫుడ్స్ టేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ఈ తెలుగు విలన్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు.ఇక ఆ విలన్ ఎవరయ్యా అంటే ఆశిష్ విద్యార్థి.. పోకిరి, కంత్రి,చిరుత, నాయక్ వంటి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో 50 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నారు. పలు దేశాలు తిరుగుతూ యూట్యూబ్ వ్లాగర్ గా పని చేసిన సమయంలో అస్సాం కి చెందిన ఫ్యాషన్ ఎంటర్ ప్రేన్యూర్ అయినటువంటి రూపాలి తో పరిచయం ఏర్పడి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.

ఇక ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య కూడా ఒప్పుకోవడంతో ఆయన రెండో పెళ్లికి లైన్ క్లియర్ అయింది.అయితే ఆశిష్ విద్యార్థి రూపాలి బరౌలి పెళ్లి 2023 లో జరిగింది. ఆ టైంలో ఈయన వయసు 60 ఏళ్లు.. అయితే పెళ్లి రెండు సంవత్సరాలు అయినప్పటికీ మరోసారి ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. దానికి ప్రధాన కారణం తన రెండో భార్యతో కలిసి ఆశిష్ విద్యార్థి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో మరోసారి ఆశిష్ విద్యార్ధి రెండో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: