తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా గద్దర్ అవార్డుల విషయంలో కీలక ప్రకటన చేసింది. 14 సంవత్సరాల తర్వాత గద్దర్ అవార్డ్స్ విజేతలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరి ఏర్పాటు కూడా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

 ఇక ఇవాళ ఉదయం... తెలుగు సినిమా అవార్డులను ప్రకటించారు నటి జయసుధ. ఈ లిస్టులో అల్లు అర్జున్ పేరు ఉండడం గమనార్హం. పుష్ప రెండో పార్టులో అత్యుత్తమ నటనకు గాను... అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో... మొదటి ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రభాస్ హీరోగా చేసిన కల్కి కి గద్దర్ అవార్డు వచ్చింది. అలాగే రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్ నియామకం కావడం జరిగింది.

 ఇక మూడవ ఉత్తమ చిత్రంగా  లక్కీ భాస్కర్  ఫైనల్ అయింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నటి జయసుధ అధికారిక ప్రకటన చేశారు. అలాగే.. ఉత్తమ నటిగా నివేదా థామస్  ఫైనల్ అయ్యారు. 35వ చిన్న కథ కాదు  అనే సినిమాకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ డైరెక్టర్ అవార్డు కల్కి సినిమా చేసిన నాగ అశ్విన్  కు వరించింది. ఇక ఉత్తమ విలన్ గా సరిపోదా శనివారం సినిమాలోని ఎస్ జే సూర్య ఫైనల్ అయ్యారు.

 ఉత్తమ సహాయ నటిగా  అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటించిన శరణ్య ప్రదీప్ కు అవార్డు వచ్చింది. ఉత్తమ కమెడియన్గా మత్తు వదలరా సినిమాలోని సత్య అలాగే వెన్నెల కిషోర్ కు అవార్డు దక్కింది. ఉత్తమ సింగర్ గా శ్రేయ ఘోషాల్  పుష్ప 2 సినిమాకు గాను అవార్డు వచ్చింది. ఉత్తమ డాన్స్ మాస్టర్ దేవర సినిమా చేసిన గణేష్ ఆచార్యకు వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: