
పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళను బెదిరిస్తూ జైల్లో వేస్తామంటున్నారని.. ఇవన్నీ కూడా దివాలా రాజకీయ మాటలు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన చేతుల్లో ఉన్న మంత్రులతో బెదిరింపులకు దిగుతున్నారని.. ఇదంతా కూడా ఫ్లాప్ సినిమా కోసమే అంటూ విమర్శిస్తున్నారు.. ఓటు వేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తూ ఉంటున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఫైర్ అయ్యారు. హరిహర వీరమల్లు చిత్రం తీయడానికి ఐదేళ్లు పట్టింది ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాలంటూ సెటైరికల్ గా మాట్లాడారు.
అయితే ఈ సినిమాని వాస్తవంగా ఈనెల 12వ తేదీన రిలీజ్ చేయాలని చూశారు.. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ ఉన్నది.. ఇప్పటికే నిర్మాతకు చాలా లాస్ అయిందని పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ఇది సినిమా అని రిలీజ్ చేయాలని చూస్తున్నప్పటికీ ఈ రాజకీయ చిక్కులలో హరిహర వీరమల్లు సినిమా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈనెల 8వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేసిన అది కూడా కొన్ని కారణాల చేత వాయిదా వేశారు. దీంతో పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న డబ్బులను కూడా వెనక్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా తిప్పలు తప్పులేదు అన్నట్లుగా కనిపిస్తున్నాయి.