సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోని ఎంతలా పొగిడేస్తూ ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తెగ ప్రశంసితూ ఉంటారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్మెగా హీరోని కాకుండా మరొక హీరోని పొగిడేస్తున్నారు.  అది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా విషయంలో నే. దీఇంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్  వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలకు రీమేక్ చేయాలి అంటే మెగా హీరోల పేర్లే ఎక్కువుగా వినిపిస్తాయి.


ఎక్కువగా జనాలు ఆయన కొడుకు చరణ్ పేరునే వాడుతూ ఉంటారు . రామ్ చరణ్ పేరును హైలైట్ చేస్తూ ఉంటారు . ఫర్ ద ఫస్ట్ టైం మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విషయంలో చరణ్ పేరును కాకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు . ఆ సినిమా మరేంటో కాదు ఠాగూర్. ఈ సినిమాని ఎప్పటికి మర్చిపోలేము.  వివి వినాయక దర్శకత్వంలో తెరకెక్కిన టాగూర్ సినిమాలో చిరంజీవి పర్ఫామెన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన ఆ సినిమాలో ఫర్ఫామ్ చేసినట్లు వేరే ఏ సినిమాలోను పర్ఫార్మ్ చేయలేదు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

 

అలాంటి ప్రశంసలు దక్కించుకున్న ఠాగూర్ సినిమాకి సీక్వెల్ వస్తే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కాకుండా ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్,  స్వయాన మెగా ఫాన్స్ ఈ విధంగా కామెంట్స్ పెడుతూ ఉండడం హైలైట్ గా మారింది. రామ్ చరణ్ బాడీ కి ఠాగూర్ సినిమా పెద్దగా సూట్ కాకపోవచ్చు అని ..ఎన్టీఆర్ అయితే ఆ డైలాగ్ డెలివరీ ..లంచం అనే మహమ్మారిపై పోరాడే సీన్స్ కి బాగా సూట్ అవుతారు అని మాట్లాడుకుంటున్నారు . చరణ్ కాకుండా తారక్ అయితే ఈ సినిమాకి బాగుంటాడు అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: