
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "నేనొక్కడినే". 2014లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది . మహేష్ బాబు ఈ మూవీలో ఇంటిగ్రేషన్ డిజాస్టర్ తో బాధపడే వ్యక్తిగా నటించాడు . అంటే మెదడుకు అన్ని విషయాలు గుర్తు పెట్టుకునే అంత సామర్థ్యం ఉండదన్నమాట .
అటువంటి క్యారెక్టర్ లో మహేష్ బాబును అద్భుతంగా చూపించాడు సుకుమార్. కానీ జనాలకి మాత్రం ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు . అంతేకాదు ఇప్పుడు చాలామంది ఆ రోల్లో మహేష్ కాకుండా నాని అయి ఉంటే సూపర్ హిట్ అయ్యుండేది అని వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఉండేది అని మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఇలాంటి క్యారెక్టర్స్ లో నాని బాగా నటిస్తాడు . అంతేకాదు రీసెంట్గా హిట్ త్రీ సినిమా చూసిన తర్వాత ఈ కామెంట్స్ మరింత ఎక్కువైపోయాయి . నాని కనుక ఆ సినిమా చేసుంటే వేరే లెవెల్ లో హిట్ అయి ఉండేది అని మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బిజీగా ఉన్నాడు..!