తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీనటులు అయినటువంటి విజయ్ దేవరకొండ , రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రష్మిక మందన ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన గీత గోవిందం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఇటు విజయ్ , అటు రష్మిక ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విజయ్ , రష్మిక కాంబోలో డియర్ కామ్రేడ్ అనే సినిమా వచ్చింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ లో విజయ్ , రష్మిక కెమిస్ట్రీ కి మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే అనేక రోజుల నుండి విజయ్ , రష్మిక ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అని , వారిద్దరూ అనేక ప్రాంతాలు కలిసి తిరుగుతున్నారు అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అనేక సార్లు వీరిద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నారు కానీ వేరు వేరుగా ఫోటోలు పోస్ట్ చేశారు అని అనేక ఫోటోలు కూడా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ ఒకే కారులో వెళ్లిన దృశ్యం కెమెరాకు చిక్కింది.

విజయ్ మొదటగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగా , ఆ తర్వాత కొంత సమయానికి రష్మిక బయటకు వచ్చారు. దీంతో విరు తమ రిలేషన్ షిప్ గురించి బహిర్గతం చేస్తున్నారా అంటూ సినీ వర్గాల్లో ఓ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "కింగ్డమ్" అనే సినిమాలో నటిస్తూ ఉండగా ... రష్మిక తాజాగా కుబేర సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd