తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి మన్మధుడు అనే పేరు ఉంది. ఇప్పటికే ఐదు పదుల వయస్సు దాటినా కానీ అద్భుతమైన లుక్ లో కనిపిస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి నాగార్జున రామ్ చరణ్  ఉపాసన ల ఎంగేజ్మెంట్ కు వెళ్లడానికి చాలా భయపడిపోయారట.. మరి ఆ కారణం ఏంటో  ఇప్పుడు చూద్దామా.. నాగార్జున ఇప్పటికి వారి  కొడుకులతో సమానంగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు.. అయితే నాగార్జున నటించిన గ్రీకు వీరుడు సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించారు.డైరెక్టర్ దశరథ్ నాగార్జున కాంబినేషన్లో  గ్రీకువీరుడు చిత్రం ప్రారంభమైంది. 

అయితే ఈ మూవీలో నాగార్జునని డిఫరెంట్ గా, స్టైలిష్ లుక్ లో ప్రజెంట్ చేయాలని డైరెక్టర్ ధశరత్ భావించారట. దీనికోసం నాగార్జునకి హెయిర్ స్పైక్ పెట్టారు. ఆ టైంలో టాలీవుడ్ లో అది సరికొత్త లుక్ అయింది. ఈ లుక్ నాగార్జున ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది.. దీనికి ముందు షిరిడి సాయి సినిమా చేసిన నాగార్జున గుబురు గడ్డంతో కనిపించారు. ఆ తర్వాత ఒకేసారి గ్రీకువీరుడు సినిమా కోసం ఆల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు. ఈ మూవీ తర్వాత నాగార్జున సరికొత్త హెయిర్ స్టైల్ సరికొత్త బియర్డ్ లుక్ లో కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

అయితే ఈ లుక్ అలా ఉండగానే రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ జరిగిందట.. నాగార్జున అక్కడికి వెళ్లడానికి జంకుతున్నారట.. కారణం సరికొత్త హెయిర్ స్టైల్.. ఆయన హెయిర్ స్టైల్ చూసి అక్కడికి వచ్చిన వారంతా ఏమంటారో అని కాస్త ఇబ్బంది పడ్డారట. కానీ నాగర్జున ఆ ఫంక్షన్ కి వెళ్లగానే రామ్ చరణ్  సైతం ఆశ్చర్యపోయారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అద్భుతమైన లుక్ అంటూ రాంచరణ్ పొగిడారట. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లంతా నాగార్జున లుక్ చూసి ఆశ్చర్యపోయి చాలా బాగుందని గుడ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: