
గుజరాత్ లో కాక్ టైల్ ప్రేమి పగ్ ఆఫ్ రీవెంజ్ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన డైరెక్టర్ మహేష్ జీరావాల మరణించారనే వార్త ఇప్పుడు ఆలస్యంగా బయటికి వచ్చింది. వాస్తవానికి ఈ దర్శకుడు విమానంలో అసలు ప్రయాణం చేయలేదు.. కానీ ఎక్కడైతే విమానం కూలిందో ఆ ప్రాంతంలో తనకు తెలిసినవారు ఉన్నారని కలిసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనట.సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన రోజే మహేష్ కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా కంగారుపడ్డారు.
అలా ఆ ప్రమాద ఘటన స్థలంలోనే తాను కూడా ఉన్నాడెమో తెలుసుకునేందుకు ముందుగా పోలీసులు ఒక డెడ్ బాడీని కుటుంబీకులు కన్ఫర్మేషన్ చేసేందుకు కోసం పంపించగా. అయితే ముందు కుటుంబ సభ్యులు వద్దన్నప్పటికీ.. చివరికి అది అతను కాదనుకున్నారని చెప్పారట.. దీంతో చివరికి అధికారులు డిఎన్ఏ పరీక్ష చేయగా.. అది డైరెక్టర్ మహేష్ డెడ్ బాడీని అన్నట్టుగా తేలిందట. దీంతో ఇలా ఆలస్యంగా ఒక ఊహించని విషాద సంఘటన సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. అయితే డైరెక్టర్ మహేష్ కేవలం డైరెక్టర్ గానే కాకుండా పలు చిత్రాలకు మ్యూజిక్ అందించడమే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఇస్తూ బాగా పాపులారిటీ సంపాదించారు.