కొన్ని కొన్ని కాంబోలు కోసం ఎప్పుడు జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు.  అది ఎప్పుడో ఒకసారి సెట్ అవుతుంది అని నమ్మకం . కానీ కొన్ని కాంబోలో సెట్ అయి ఉంటే బాగుండేది అని ఆలోచిస్తుంటారు . దానికి కారణం ఆ హీరో లేకపోతే ఆ డైరెక్టర్ ఈ లోకంలో లేకపోతూ ఉండడమే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్రేజీ కాంబో గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.  అది కూడా ఇప్పుడు మన మధ్య లేని హీరో గురించి . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది .


సందీప్ రెడ్డివంగా కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు నీతి నిజాయితీలు నమ్ముకుని ముందుకు వెళ్తున్న మనిషి . ఆయన తెరకెక్కించే  సినిమాలు కొంచెం వైలెంట్ గా ఉండొచ్చు.  కానీ ఆయన మాత్రం చాలా చాలా సాఫ్ట్.  కానీ ఆయన జోలికి వస్తే మాత్రం విపరీతంగా వైలెంట్ అయిపోతాడు.  మంచికొస్తే మంచి.. చెడుకొస్తే చెడు తాట తీసేస్తాడు . అలాంటి ఒక దమ్మున్న క్యారెక్టర్ సందీప్ రెడ్డివంగాది . ఆయన తెరకెక్కించే సినిమాలలోనే మాత్రమే కాదు ఆయన నిజ జీవితంలోనూ ఆ దమ్మును ప్రదర్శిస్తూ ఉంటాడు.

 

కాగా సందీప్ రెడ్డివంగ ప్రజెంట్ "స్పిరిట్"  సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు . ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. కాగా  ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.  సందీప్ రెడ్డి వంగ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ లాంటి టాలెంట్ ఉన్న స్టార్ హీరో ను డైరెక్ట్ చేసుంటే.. చాలా చాలా బాగుండేది అని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ కాంబోలో సినిమా గానీ వచ్చి ఉంటే బాక్సాఫీస్ బద్దలైపోయి ఉండేది అని ..ఉదయ్ కిరణ్  జీవితాన్ని మలుపు తిప్పిన "చిత్రం" సినిమాకి సీక్వెల్ లా వచ్చుంటే బాగుండేది అని మాట్లాడుకుంటున్నారు.



ఉదయ్ కిరణ్ బ్రతికుంటే ఇప్పుడు సందీప్ రెడ్డివంగా ఈ సీక్వెల్ ప్లాన్ చేసుంటే.. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు అందుకునే పర్ఫామెన్స్ ఉదయ్ కిరణ్ ఇచ్చుండే వాడు అని మాట్లాడుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ కి  ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.  ఆయన మన మధ్య లేకపోయిన ఆయన కి సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో స్టార్ గా ఎదిగిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఎంత త్వరగా స్టార్ గా మారాడో.. అంతకంటే త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.  ఆయన సూసైడ్ చేసుకొని మరణించాడు . ఆయన సూసైడ్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: