తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. కోట‌ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కోట సినీ ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. ఆయ‌న నటనా ప్రతిభ, డైలాగ్ డెలివరీ, హావభావాలు అనేక తరాల వారిని మెప్పించాయి. ప్రతి సినిమాలో కొత్త కోణంలో కనిపించే ప్రయత్నం చేస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బ‌ల‌మైన స్థానం సంపాదించుకున్న కోట శ్రీ‌నివాసరావుకు నంబర్ 8 చాలా ఇష్ట‌మ‌న్న సంగ‌తి మీకు తెలుసా?


అవును, 8 అనేది ఆయ‌న ల‌క్కీ నంబర్. ఈ విష‌యాన్ని కోట ప‌లు సంద‌ర్భాల్లో స్వ‌యంగా వెల్ల‌డించారు. నంబర్ 8తో కోట‌కు విడ‌తీయ‌లేని సంబంధం ఉంది. తెలుగులో కోటా శ్రీ‌నివాస‌రావు పేరు ఎనిమిది అక్షరాలు. ఇంగ్లీష్ లోని అక్షరాలు కూడిన ఎనిమిది వస్తుంది. అలాగే కోట శ్రీ‌నివాస‌రావుకు `ప్రతిఘటన` ఎంత‌టి గుర్తింపు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టి. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిల్మ్ కోట‌ను నటుడిగా పూర్తి స్థాయిలో నెల‌బెట్టింది. అక్కడ నుండి కోట వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.  


అయితే ప్రతిఘటన చిత్రం విడుదల తేదీ, సంవత్సరం, నెల అన్నీ కూడితే 8 నంబరే వస్తుంది. అంతేకాదండోయ్‌.. కోట శ్రీ‌నివాస‌రావు రోడ్ నంబర్ కూడా ఎనిమిదె. యాదృచ్చికంగా తనకు ఎనిమిది ప‌దే ప‌దే ఎదురవుతుండ‌టం వ‌ల్ల‌నో ఏమో.. ఆ నంబ‌ర్ పై ప్ర‌త్యేక గౌర‌వం ఏర్ప‌డింద‌ని కోటా శ్రీ‌నివాస‌రావు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: