
షూటింగ్స్, బిజినెస్, ఇతర కారణాల వల్ల ఎంత బిజీగా ఉన్నా నాగార్జున మాత్రం రాత్రి 7 గంటలకే డిన్నర్ పూర్తి చేస్తారట.. నియమాలను కరెక్ట్ గా పాటించడం వల్లే ఇతర హీరోలకు సాధ్యం కాని విధంగా కనిపిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. గడిచిన 35 సంవత్సరాలుగా నాగ్ ఇదే నియమాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారంటే ఆయన డెడికేషన్ ఏపాటిదో సులువుగా అర్థమవుతుంది.
నాగార్జున రెమ్యునరేషన్ 20 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తాను డిన్నర్ లో సలాడ్స్ తో పాటు చేపలు, చికెన్ ఎక్కువగా తీసుకుంటున్నానని నాగార్జున పేర్కొన్నారు. తినే ఆహారం ఎంత ముఖ్యమో తినే సమయం కూడా అంతే ముఖ్యమని నాగ్ చెబుతున్నారు. సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి బిగ్ బాస్ షో సీజన్9 మొదలు కానుండగా క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు ఈసారి షోలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
కూలీ సినిమాలో నాగార్జున సైమన్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనుండగా ఈ సినిమా సక్సెస్ సాధించడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 44 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాల్సి ఉంది.