పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో రెండు భాగాలుగా వస్తున్న తొలి చిత్రం `హరిహర వీరమల్లు`. ఈ హిస్టారికల్ ఫిల్మ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించారు. అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాబీ డియోల్, పూజిత పొన్నాడ, నర్గీస్ ఫక్రీ, ఆదిత్య మీనన్ త‌దిత‌రులు ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. కీరవాణి సంగీతం అందించారు.


దాదాపు ఐదేళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు పార్ట్ 1 ఇటీవ‌లె షూటింగ్‌, పోస్ట్ ప్రొడెక్ష‌న్ వ‌ర్క్ కంప్లీట్ చేసుకుని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ సంగతులు షేర్ చేసుకుంది. హరిహర వీర‌మ‌ల్లు మూవీ ఒక విజువల్ వండర్‌లా ఉంటుందని.. ఎ.ఎం. రత్నం గారు ఎక్కడ రాజీ పడకుండా సినిమాను నిర్మించారని నిధి అగర్వాల్ పేర్కొంది.


అలాగే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడ్డారని.. డైలాగ్స్‌, సాంగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా ప్రతి విభాగంలోనూ ఆయన భాగం అయ్యారని నిధి పేర్కొంది. ఇదే క్రమంలో ప‌నిలో ప‌నిగా హరిహర వీరమల్లు పార్ట 2పై కూడా నిధి క్రేజీ అప్డేట్ ఇచ్చింది. వీరమల్లు పార్ట్ 2కు సంబంధించి 20 నిమిషాల షూటింగ్ పూర్తి చేశామని.. మొదటి భాగం విడుదలైన వెంట‌నే సెకండ్ పార్ట్ ను తిరిగి ప్రారంభిస్తామని నిధి అగర్వాల్ పేర్కొంది. ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: