టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు. తారక్ కి అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన దర్శకులలో వి వి వినాయక్ ఒకరు. తారక్ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. అలాంటి సమయం లోనే ఈయన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న ఇది కాస్త క్లాస్ మూవీ గా రూపొందడంతో మాస్ ఆడియన్స్ లో ఈ మూవీ ద్వారా తారక్ కి పెద్ద స్థాయి క్రేజ్ రాలేదు. ఆ తర్వాత తారక్ , వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ మాస్ ఎంటర్టైనర్గా రూపొంది బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాతో తారక్ కి తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరోగా సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తారక్ , వినాయక్ కాంబోలో సాంబ , అదుర్స్ అనే మూవీలు వచ్చాయి. ఇందులో సాంబ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అదుర్స్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తారక్ , వినాయక్ కాంబోలో ఓ రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవి ..? అనేది తెలుసుకుందాం.

వినాయక్ సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా దిల్ అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట వినాయక్ , నితిన్ ను కాకుండా తారకను హీరోగా అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్ కాలేదట. ఇక వినాయక్ కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరో గా కృష్ణ అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కూడా మొదట వినాయక్ , రవితేజ ను కాకుండా తారక్ ను హీరోగా అనుకున్నాడట. కానీ ఈ సినిమా కూడా సెట్ కాలేదట. ఇలా తారక్ , వినాయక్ కాంబో లో దిల్ , కృష్ణ సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: