భారతీయ సంస్కృతిలో అత్యంత చిరస్మరణీయమైన రామాయ‌ణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో నితీశ్ తివారీ ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే `రామాయ‌ణ‌`. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.


అయితే బాలీవుడ్ తో ఎంద‌రో అగ్ర‌తార‌లు ఉండ‌గా.. ప‌నిగ‌ట్టుకుని రామాయ‌ణ‌లో సీత పాత్ర‌కు సౌత్ బ్యూటీ సాయిప‌ల్ల‌వినే ఎందుకు తీసుకున్నారు? అన్న డౌట్ చాలా మందికి ఉంది. తాజాగా ఈ విష‌యంపై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. సీత‌గా సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసుకోవ‌డం వెనుక కార‌ణం ఆమె గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌టం, అందాన్ని పెంచుకునేందుకు స‌ర్జ‌రీలు చేయించుకోక‌పోవ‌డ‌మే అంటూ మేక‌ర్స్ షాకింగ్ రిప్లై ఇచ్చారు.


సాయిప‌ల్ల‌విని సీత క్యారెక్ట‌ర్ కు తీసుకోవ‌డం ద్వారా కృత్రిమం క‌న్నా స‌హజ అంద‌మే బాగుంటుంద‌ని మెసేజ్ ఇచ్చిన‌ట్లు కూడా ఉంటుంద‌ని తెలిపారు. అలాగే ర‌ణ్‌బీర్‌ను రాముడి పాత్ర‌కు తీసుకోవడానికి కార‌ణం ఆయ‌న న‌ట‌నా నైపుణ్యం, ప్రశాంతమైన వ్య‌క్తిత్వమ‌ని రామాయ‌ణ టీమ్ పేర్కొంది. కాగా, బాలీవుడ్ తో ఎంత ప్ర‌తిష్మాత్మ‌కంగా దాదాపు రూ.4000 కోట్ల బ‌డ్జెట్ తో రామాయ‌ణ సినిమాను రూపొందిస్తున్నారు. నమిత్‌ మల్హోత్రా ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుధీర్ఘ స‌న్న‌హాల అనంత‌రం గ‌త ఏడాది ముంబైలోని ఓ స్టూడియోలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: