ఎప్పుడు సంచలన పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి మాధవి లత అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మాధవి లత హీరోయిన్ గానే కాకుండా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి బిజెపిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి మాధవి లత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది. అయితే ఒక టీవీ ఛానల్ ని టార్గెట్ చేస్తూ మాధవి లత పోస్ట్ పెట్టింది.మరి ఇంతకీ మాధవి లత టార్గెట్ చేసిన టీవీ ఛానల్ పేరేంటి అనేది ఇప్పుడు చూద్దాం.ఒకప్పుడు టీవీ చానల్స్ ఎంత బాగుండేవో అందులో వచ్చే సీరియల్స్,సినిమాలు,షోలు అందరిని ఎంత ఆకట్టుకునేవో చెప్పనక్కర్లేదు. అందులో వచ్చే సీరియల్స్,షోలను అయితే ఇంటిల్లిపాది కూర్చొని చూసేవారు.

కానీ ఇప్పుడు వచ్చే షోలలో అలాంటివి కనిపించడం లేదు. చిన్నపిల్లల ముందు చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. అంతే కాదు పెద్దవాళ్ళు ఇద్దరు పక్కపక్కన కూర్చొని చూసినా కూడా అసభ్యంగా అనిపిస్తుంది. అలాంటి టీవీ షోలు వస్తున్నాయి.అయితే ఇలాంటి షోల గురించి తాజాగా మాధవి లత తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. నాకు ఈటీవీ ఎప్పటికీ మాతృ సంస్థ.ఎందుకంటే ఈనాడులో నేను యాంకర్ గా చేసి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యాను. అందుకే నేను ఆ సంస్థను ఎప్పటికీ మర్చిపోలేను. రామోజీరావు గారు నన్ను తన కూతుర్లాగే చూశారు.అంతేకాదు రామోజీరావు సంస్థలన్నీ నన్ను మా సొంత అమ్మాయి అని చెప్పుకుంటారు. 

పంచంలో టీవీలలో ఎలాంటి షోస్ వేస్తే ప్రేక్షకులు ఆకట్టుకుంటారు అనేది అర్థం చేసుకోగలను. కానీ మరీ మితిమీరిన కామెంట్లు అసభ్యత ఉంటే మాత్రం సహించలేం. షోలలో మితిమీరిన బూతులు,ఐటెం సాంగ్స్, బట్టలిప్పుకొని డ్యాన్సులు చేయడం చాలా చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చూసేవారు. కానీ ఇప్పుడు కనీసం నా ఫ్రెండ్స్ తో కలిసి చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంత అసభ్యత చూపిస్తున్నారు. రామోజీరావు తన ఈనాడు ఈటీవీ లో ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు అన్ని ఛానల్స్ కి డిఫరెంట్ గా ఉండే కార్యక్రమాలు తీసుకొచ్చారు. 

అలాగే ఈనాడు సంస్థ కూడా చాలామందికి అన్నం పెట్టింది. అయితే అలాంటి ఈనాడు,ఈ టీవీ ఛానల్స్ లో వస్తున్న అసభ్యతను చూసి సామాజిక బాధ్యత కోసం ఈ పోస్ట్ పెట్టాను. అంతేకానీ టార్గెట్ చేయాలని కాదు. ఒకప్పుడు ఈటీవీని చాలా మంది చూసేవారు.కానీ ఇప్పుడు చూడడానికి చాలా చెండాలంగా ఉంది అంటూ ఈ టీవీ ఛానల్ పై, ఈనాడు సంస్థలపై సంచలన పోస్ట్ పెట్టింది మాధవిలత. ప్రస్తుతం మాధవి లత పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట్లో దుమారం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: