టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి  రూటే సపరేట్  అనే సంగతి తెలిసిందే.  జక్కన్న  తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో సంచలనాలు సృష్టించారు.  బాహుబలి, భాహుబలి2,   టీపుల్ ఆర్ సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న  రాజమౌళి  తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం  మ్యాజిక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.

సినిమా గురించి ఎలాంటి  అప్ డేట్స్  ఇవ్వకుండానే   సినిమాపై  రాజమౌళి  అంచనాలను పెంచుతున్నారు. ఆగస్టు నెల 9వ తేదీన  మహేష్  పుట్టినరోజున ఈ సినిమా నుంచి గ్లిమ్ప్స్  విడుదలయ్యే అవకాశం  ఉందని వినిపిస్తుండగా ఆ ప్రచారంలో  నిజానిజాలు తెలియాల్సి ఉంది.  అయితే బాహుబలి3  సినిమా కూడా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని  అభిప్రాయాలు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.

భాహుబలి1  భాహుబలి2 సినిమాలను ఒకే  సినిమాలా విడుదల చేయడం వెనుక  ప్లాన్ ఇదేనని  తెలుస్తోంది.  బాహుబలి3 తెరకెక్కితే  ఈ సినిమా 4000 కోట్ల రూపాయల కలెక్షన్లను  సాధించే  ఛాన్స్ అయితే ఉందని  అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.  రాజమౌళి  మనస్సులో ఈ ప్రాజెక్ట్ విషయంలో  ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో  తెలియాల్సి ఉంది.  రాజమౌళి ఒక్కో మెట్టు  ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.

బాహుబలి రీరిలీజ్ వెర్షన్ లో  కొత్త సన్నివేశాలు కూడా ఉన్నాయని   కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.  బాహుబలి ది  ఎపిక్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుండగా  ఈ సినిమాకు  ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో జరగనున్నాయని తెలుస్తోంది.  రాజమౌళి  తర్వాత  ప్రాజెక్ట్స్  గురించి స్పష్టత  వస్తే  అభిమానులు సైతం  ఎంతగానో  సంతోషించే అవకాశాలు  ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: