తెలుగు ప్రేక్షకులను బాగా అలరించినటువంటి షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సోనియా ఆకుల గురించి చెప్పాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ 8లో అడుగుపెట్టిన ఈమె కొద్ది రోజులకే ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్ గురించి తెలియజేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకి వివాహం చేసుకుంది. నవంబర్లో నిశ్చితార్థం చేసుకొని  నెల రోజులలోపే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.


ఇటీవలే తిరుమలను సందర్శించిన సోనియా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది సోనియా. ఈ విషయం విన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సోనియా అందరికంటే భిన్నంగా వీడియోతో రివీల్ చేసింది.ఓ ప్రాజెక్ట్ రూపంలో ఒక ఫైల్ పెట్టుకుని మరీ వచ్చి తన భర్త యష్ కి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ శుభవార్త విన్న తర్వాత తన భర్త సోనియాను హత్తుకొని మరి ఆనందాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతున్నది.


తెలంగాణ ప్రాంతానికి చెందిన సోనియా యాంకర్ గా, నటిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నది. వర్మ తీసిన రెండు మూడు చిత్రాలలో నటించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించిన ఈమె.. అందులో నిఖిల్, పృథ్వీ తో లవ్ ట్రాక్ నడిపిందనే విషయంపై చాలా నెగిటివిటీ మూట కట్టుకుంది. అయితే చివరికి మాత్రం ఎలిమినేట్ అయ్యింది సోనియా ఆకుల. 2019లో వచ్చిన జార్జి రెడ్డి చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ తదితర చిత్రాలలో నటించిన సోనియా  ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొనింది.

మరింత సమాచారం తెలుసుకోండి: