
ఈ పాటలో బాలయ్య పర్ఫామెన్స్ ఎంత హైలెట్ గా ఉంది అనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భలే చిందులు వేశాడు. కాగా ఈ పాట ఎన్ని సార్లు చూసిన సరే తనివి తీరదు. చాలా ప్రోగ్రామ్‌స్ ఈవెంట్స్ లో ఈ పాట ప్లే అవుతూనే ఉంటుంది. అదే ఫ్రెష్ ఫీలింగ్ కలగ జేస్తూనే ఉంటుంది . అయితే ఇన్నాళ్ళకి ఈపాటకి రీమేక్ పాటను తెరకెక్కించబోతున్నారు మూవీ మేకర్స్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఈ పాటపై కన్నేశాడు హీరో నాని అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. సినీ వర్గాలలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
నాని తన నెక్స్ట్ సినిమా కోసం బాలయ్య హిట్ సినిమాలోని "రావయ్య ముద్దుల మామ" పాటను రీమేక్ చేయబోతున్నారట . ఈ మధ్యకాలంలో ఇది ఓ ట్రెండ్ లా మారిపోయింది . అయితే నాని - బాలయ్య కు బిగ్ బిగ్ ఫ్యాన్. ఈ పాటను చూస్ చేసుకోవడం నందమూరి అభిమానులకి కూడా చాలా చాలా నచ్చేసింది. అయితే ఎటువంటి ఓవరాక్షన్ లేకుండా ఉన్న పాటను ఉన్నట్లు రీమేక్ చేసి సింపుల్ గా జనాలను అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. డీజేలు ఎక్స్ ట్రా సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ గా ఉన్న పాటను ఉన్నట్లే రీమేక్ చేసి తన సినిమాలో వాడుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి నాని ఏం చేస్తాడు అనేది. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నందమూరి అభిమానులని ఇంప్రెస్ చేస్తుందో లేదో..??