
అయితే "కుబేర" లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శేఖర్ కమ్ముల..ఆ తర్వాత ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది అందరికీ బిగ్ క్వశ్చన్ మార్క్ . అందుతున్న సమాచారం ప్రకారం నానితో ఆయన సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తుంది . ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీగా తెరకెక్కబోతుందట . ఈ కధను చాలా స్పెషల్ గా రాసుకున్నారట శేఖర్ కమ్ముల. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎలా అబ్బాయిలను మోసం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఆ పాయింట్ బేస్ చేసుకుని అసలు లవ్ అంటే ఏంటి ..? రియల్ లవ్ అంటే ఏంటి ..?
అట్రాక్షన్ అంటే ఏంటి..? కుర్రాళ్ళు దేనిని లవ్ అనుకుంటున్నారు..? అసలు లవ్ లో మోసం చేయడం ఎవరిది..? తప్పు కుర్రాళ్లదా..? అమ్మాయిలదా..? అనే కాన్ సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇది చాలా చాలా సెన్సిటివ్ టాపిక్. అటు ఇటు అయితే కచ్చితంగా ఊహించిన చిక్కుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది . కానీ శేఖర్ కమ్ముల మాత్రం ధైర్యంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నటి నటులను కూడా అలాంటి వాళ్లనే చూస్ చేసుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో..???