టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటించగా ... అనుష్కమూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాను తిరిగి మళ్లీ రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ సినిమాను ఈ సంవత్సరం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ లు రీ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టాయి. మరి ఇంద్ర సినిమా కూడా మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీ కి సంబంధించిన కేవలం ఒకే పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అని ఈ మూవీ దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఈ మూవీ తో పాటు చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మెగా 157 అనే వర్కింగ్ అయితే పూర్తి చేస్తున్నారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: