పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రతినిత్యం బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు. గ‌తంలో మాదిరి జోరుగా సినిమాలు చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ సినిమాలకు దూరం కానున్నారని ఇప్ప‌టికే పలుమార్లు ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం `హరిహర వీరమల్లు` ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్సే.


జూలై 24న హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్‌ చేసింది. ఏఎం రత్నం నిర్మాత. అయితే వీర‌మ‌ల్లును ప్రమోట్ చేసేందుకు ఫస్ట్ టైం పవన్ మీడియా ముందుకు వచ్చారు. సినిమా ప్రారంభ‌మైన నాటి నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంద‌ని పవన్ వివరించారు.


కోహినూర్‌ వజ్రం చుట్టూ ఈ మూవీ క‌థ‌ తిరుగుతుందని.. క్రిష్‌ మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడ‌ని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. ఏఎం రత్నం గారు ఈ సినిమా కోసం ఎంతో న‌లిగిపోయారు.. డబ్బులు సక్సెస్ కోసం కాదు ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల వెంట నిలబడడం చాలా ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు తిడుతున్న రత్నం గారి కోసం ఈ మీటింగ్ కు వచ్చానని పవన్ తెలిపారు


ఇక సినిమా నాకు అన్నం పెట్టింది. సినిమా అంటే తనకు ప్రాణవాయువుతో సమానం. కానీ భవిష్యత్తులో సినిమాలు చేస్తాను లేదో  నాకు తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌లో సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌ల‌కు దారి తీశాయి. కొంద‌రు ఒక అడుగు ముందుకేసి ప‌వ‌న్ త్వ‌ర‌లో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడంటూ ప్ర‌చారం కూడా స్టార్ట్ చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: