ఈ మధ్యకాలంలో కొంతమంది మనుషులకి మానవత్వం అనేది లేకుండా పోయింది. ఓపిక - సహనం పూర్తిగా లేకుండా పోయింది . తాజాగా మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో రిసెప్షనిష్టు పై జరిగిన దాడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం అందరికీ తెలుసు . 25 ఏళ్ల రిసెప్షనిస్ట్ సోనాలి పై గోకుల్ ఝు  అనే వ్యక్తి దారుణాతి దారుణంగా దాడి చేశారు.  అపాయింట్ మెంట్ లేకుండా డాక్టర్ ఛాంబర్ లోకి వెళ్ళడానికి అనుమతించకపోవడంతో కోపానికి గురైన గోకుల్ ఝా ఆ రిసెప్షన్ ని దారుణతి దారుణంగా కొట్టాడు .


జుట్టు పట్టుకొని లాగి నేలకేసి కొట్టడం స్పష్టంగా సీసీ టీవీలో కనిపించింది . అక్కడే ఉన్న కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతను తన దాడిని కొనసాగించాడు . ఈ దాడిలో రిసెప్షనిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అతగాడు పై పోలీస్ కేసు నమోదయింది. దీనిపై పలువురు స్టార్ సెలబ్రెటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు . తాజాగా జాన్వి కపూర్ రియాక్ట్ అయింది . తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది .



తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో జాన్వి కపూర్ రాసుకోస్తూ .."ఇలాంటి వాళ్ళని కచ్చితంగా జైల్లో పెట్టాలి ..అసలు ఇలాంటి ప్రవర్తనను ఎలా సమర్థిస్తారు ..?? అసలు అతడికి బుద్ధుందా..?? ఒక వ్యక్తిపై చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం..? మానవత్వం లేకుండా పోయింది. ఇది చాలా చాలా హేయమైన చర్య . ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు. జైల్లో పెట్టాలి . కచ్చితంగా వాడికి శిక్ష పడాలి . అంతకంత అనుభవిస్తాడు " అనే రేంజ్ లోనే ఘాటుగా శాపనార్థాలు పెట్టింది.  ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపట్ల చాలామంది జాన్విని పొగిడేస్తున్నారు. "చాలామంది హీరోయిన్స్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ పై పెద్దగా స్పందించరు..మీరు చాలా నిజాయితీగా స్పందించారు అని రియల్లీ యువర్ గ్రేట్ మేడం ..మీ తల్లి పోలికలు మీకు చాలా వచ్చాయి "అంటూ శ్రీదేవి గతంలో చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: