`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ శైలిలో ఉండ‌బోతుంది. ఇందులో హీరోయిన్ ప్రియాంక చోప్రా కాగా.. మ‌ల‌యాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ మెయిన్ విల‌న్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆర్‌. మాధవన్, జిషు సేన్‌గుప్తా త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.


2025 జనవరిలో పూజా కార్యక్రమాలతో `ఎస్ఎస్ఎమ్‌బీ 29` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ  షూటింగ్ ప్రారంభ‌మైంది. దాదాపు రూ. 100 కోట్ల బ‌డ్జెట్ తో  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. అయితే తాజాగా సినిమా స్టోరీకి సంబంధించి న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇచ్చిన లీకుల‌తో ఆ అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.


జూలై 25న విడుద‌ల కానున్న త‌న `స‌ర్జ‌మీన్` మూవీ ప్ర‌మోష‌న్స్ లో పృథ్వీరాజ్ `ఎస్ఎస్ఎమ్‌బీ 29` గురించి మాట్లాడారు. `ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాజ‌మౌళి సార్ ఈ సినిమా క‌థ‌ను తీర్చిదిద్దుతున్నారు. అది ఒక అద్భుత దృశ్య కావ్యం. ప్ర‌తిఒక్క‌రినీ మెప్పించేలా క‌థ‌ను చెప్ప‌డంలో రాజ‌మౌళి గారు సిద్ధ‌హ‌స్తుడు. ఆయ‌న సెలెక్ట్ చేసుకునే క‌థ‌ల‌న్ని ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ఈ చిత్రం ఆడియెన్స్‌కు విజువ‌ల్‌ ట్రీట్‌లా ఉంటుంది` అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఈయ‌న కామెంట్స్ అటు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ ల‌వ‌ర్స్ ను కూడా ఎంత‌గానో ఎగ్జైట్ చేస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: