పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటించిన హరిహర వీరమల్లు చిత్రం నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. ఇందులో ఎంతో మంది యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్, బాబీ డియోల్,నిధి అగర్వాల్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. గతంలో ఈ చిత్రానికి సంబంధించి చాలామంది నటీనటుల ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా వినిపించాయి. కానీ ఆ తర్వాత మళ్లీ ఈమెను తప్పించి మరొకటి నటి నోరా ఫతేహీ ను తీసుకున్నట్లు వినిపించాయి.


అలాగే మరొక నటి నర్గీస్ ఫక్రిని కూడా తీసుకున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. చిత్ర బృందం కూడా ఎన్నోసార్లు నోరా ఫతేహీ గురించి ప్రస్తావించడమే కాకుండా ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందంటూ తెలియజేయడం జరిగింది. కానీ తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఇద్దరు లేరు.. గతంలో నోరా ఫతేహీ సినిమా షూటింగ్ కూడా చేశామని చెప్పినప్పటికీ హరిహర వీరమల్లు సినిమాలో ఎక్కడా కనిపించడం లేదు.



అయితే సెకండ్ పార్ట్ కి సంబంధించి 30% షూటింగ్ పూర్తి అయ్యిందని చిత్ర బృందం తెలియజేశారు. కాబట్టి నోరా ఫతేహీ అందులో ఉంటుందేమో అని అభిమానులు భావిస్తున్నారు. ఇక నటి నర్గీస్ ఫక్రి ఔరంగజేబు చెల్లెలి పాత్రలో కనిపించాల్సి ఉండగా మరి ఎందుకో ఈ సినిమాలో కనిపించలేదట. సెకండ్ పార్ట్ లో ఏమైనా చూపిస్తారా అంటూ అభిమానులు అడుగుతున్నారు. వీటికి తోడు బాలీవుడ్ నటుడైన అనుపమ్ ఖేర్  కూడా ఉన్నారని చిత్ర బృందం ప్రకటించిన ఈ సినిమాలో కనిపించలేదు. మరి వీరి సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేసారా లేకపోతే రెండవ భాగం కోసం ఉంచార అన్న విషయం తెలియాలి. మరి హరిహర వీరమల్లు 2 భాగం ఎప్పుడు తీస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: