మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నారు. మే నెలలోనే ఈ గుడ్ న్యూస్ వరుణ్, లావణ్య దంపతులు తమ అభిమానంతో పంచుకున్నారు. మరి కొద్ది రోజుల్లో తాము తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నామ‌ని, జీవితంలో అత్యంత సంతోష‌క‌ర బాధ్య‌త‌ను తీసుకోబోతున్నామని వెల్లడించారు.


అయితే పుట్ట‌బోయే బిడ్డ‌ కోసం వరుణ్ తేజ్ ఇప్పటినుంచే షాపింగ్ షురూ చేశాడు. బేబీ కోసం షాపింగ్ లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఫోటోను తాజాగా లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫోటోకు `నా రియల్ బంగారం బేబీ కోసం ఏ బ్లాంకెట్ కొనాలో డిసైడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. లావ‌ణ్య పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.
పుట్ట‌బోయే బేబీ కోసం ఏ బ్లాంకెట్ కొనాలో డిసైడ్ కాలేక డైల‌మాలో ఉన్న వ‌రుణ్ తేజ్‌ను చూసి నెటిజ‌న్లు సో క్యూట్ అని కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రైతే అడ్వాన్స్ గా పేరెంట్స్ టు బి అని వ‌రుణ్‌, లావ‌ణ్య దంప‌తుల‌కు విషెస్ కూడా చెప్పేస్తున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే..వరుణ్ తేజ్‌ సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది వ‌రుణ్ నుంచి వ‌చ్చిన `ఆపరేషన్ వాలెంటైన్`, `మట్కా` చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ ప‌రిచాయి. ప్రస్తుతం వరుణ్ తేజ తన 15వ చిత్రాన్ని మేర్లపాక గాంధీ ద‌ర్శకత్వంలో చేస్తున్నాడు. మరోవైపు లావణ్య త్రిపాఠి కొద్ది రోజుల క్రితం `సతీలీలావతి` అనే సినిమాలో భాగ‌మైంది. కానీ ఇంతలోనే ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్ల ఆ ప్రాజెక్టు ఉందా? లేదా? అన్నది స్పష్టత లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: