ఇది నిజంగా నాని అభిమానులకి కనీ విని ఎరుగని బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాపై అభిమానులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు.  దానికి ది వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ . ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేస్తున్నాడు . గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన "దసరా" సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే .

సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అయ్యింది అని తెలియడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు .  దానికి తగ్గట్టే ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది అంటూ మూవీ మేకర్స్ చెప్పడంతో ఫ్యాన్స్ ఈ సినిమాని ఓ రేంజ్ లో ఊహించేసుకున్నారు . తాజాగా ఈ చిత్రంలో నాని పాత్ర పేరు రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు . ఈ చిత్రంలో నాని "జడల్" అనే పాత్రలో కనిపించబోతున్నారు . ఇది ఒక అల్లికగా ప్రారంభమై విప్లవంగా ముగిసింది అంటూ పేర్కొన్నారు .

ప్యారడైజ్  లుక్ పోస్టర్లో నాని రెండు జడలతో కనిపించడం ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.  నాచురల్ స్టార్ నాని ఏంటి..? ఈ విధంగా కనిపించాడు అని అంతా మాట్లాడుకుంటున్నారు.  కానీ ఈ సినిమాలో నాని పాత్ర మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతుంది అని ఇప్పటివరకు ఏ స్టార్.. ఏ పాన్ ఇండియా స్టార్ .. ఎవరు కూడా ఇటువంటి పాత్రలో కనిపించలేదు అని .. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ లోనే నాని ఇలాంటి ఒక పాత్రలో కనిపించబోతున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి ఒకే ఒక్క పిక్చర్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేశాడు జడల్. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . ప్రెసెంట్ నాని "ప్యారడైజ్" పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: