నేడు సెప్టెంబర్ 2. సాధారణంగా అందరికీ ఇది క్యాలెండర్‌లో ఒక సాధారణ తేదీగా మాత్రమే కనిపించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది ఒక దేవుడు జన్మించిన రోజు. ఫ్యాన్స్ ఈ రోజును ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తన పుట్టినరోజును మరిచిపోవచ్చు, కానీ ఆయన అభిమానులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు.
 

సెప్టెంబర్ 2, 1971న జన్మించిన పవన్, రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన స్థానంలో ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సానుకూల మార్గంలో ఆయన గేమ్-చేంజర్‌గా మారిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానుల ఆయనకి సంబంధించిన  ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ చేస్తున్నారు.  సాధారణంగా ఇంటి నుండి బయటకి వెళ్తుంటే ఎవ్వరైనా తమ కి కావాల్సిన వస్తువులను జాత్రగా తీసుకెళ్తుంటారు.



కానీ పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళితే కచ్చితంగా ఆయన చేతిలో బుక్ ఉండాలి. ఆయనకు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఒక గంట సమయం దొరికినా, ఆ గంటలో కూడా ఆయన బుక్ చదువుతూనే ఉంటారు. ఆయనతో పని చేసిన డైరెక్టర్లు కూడా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో బయటపెట్టారు. జర్నీ చేసే సమయంలో కూడా ఆయన రెండు-మూడు బుక్స్ తన వెంటనే ఉంచుకుంటారట. పవన్ కళ్యాణ్ కి బుక్ చదవడంలో వచ్చే హ్యాపీనెస్ మనశాంతి మరి దేంతో ఉండదట. బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తే వేరే విషయాలను కూడా పెద్దగా పట్టించుకోరట. మెగా హీరోలు కూడా చాలా సంధర్భాలల్లో ఇలా తెలిపారు. అంతేకాదు, ఎవరికైనా బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, పవన్ కళ్యాణ్ మొదటగా బుక్స్‌ను ప్రిఫర్ చేస్తారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: