
ఆ లిస్టులో మనమే కాదు, పెద్ద పెద్ద స్టార్స్ కూడా వస్తారు. ముఖ్యంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే జస్ట్ పేరు కాదు, ఇండస్ట్రీలో ఒక శక్తివంతమైన ఎనర్జీ. ఆయన సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో ఊహించుకుంటూ అభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరో, పాన్-ఇండియా స్టార్. కానీ ఒకవేళ ఆయన సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఆయన కటౌట్, ఆయన బ్యాక్‌గ్రౌండ్, ఆయన ఇష్టపడే విషయాల ప్రకారం ఏమై ఉండేవారో అంటూ ఫ్యాన్స్ సరదాగా మాట్లాడుకుంటున్నారు.
కొంతమంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కి డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఒక నృత్య కళాకారుడిగా సెటిల్ అయ్యేవారని అంటున్నారు. చిన్నప్పటి నుంచే ఆయన కూచిపూడి నాట్యం అద్భుతంగా చేసేవారు. చిన్న వయసులోనే స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి ప్రశంసలు పొందారు. అందుకే ఆయన సినిమాల్లోకి రాకపోయి ఉంటే దేశంలో టాప్ కూచిపూడి ఆర్టిస్టులలో ఒకరు అయ్యేవారని అంటున్నారు. మరికొందరు జూనియర్ ఎన్టీఆర్‌కి మంచి బిజినెస్ మైండ్ ఉందని, హీరో కాకపోయినా బిజినెస్‌మ్యాన్‌గా సెటిల్ అయ్యేవారని, ఆయన కటౌట్‌కి అది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొంతమంది ఆయన తాత పోలికలు, ఆయన మాట్లాడే విధానం వల్ల రాజకీయాల్లోకి రావడానికి ఆయన పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. ఫ్యూచర్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి రావాలని, టాప్ పొజిషన్‌కి చేరాలని, ముఖ్యంగా సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు రకరకాలుగా ట్రెండ్ అవుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ ఏ రంగంలో సెటిల్ అయి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు? మీ ఆన్సర్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.