కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో మురగదాస్ ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన దర్శకుడిగా కెరియర్ను కొనసాగించిన ఈయన ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి భారీ ఆపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన సల్మాన్ ఖాన్ హీరో గా సికిందర్ అనే హిందీ సినిమాను రూపొందించాడు. ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న అనేక ఇండస్ట్రీలు 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తమిళ సినీ పరిశ్రమ మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్లను అందుకోలేదు. ఇక తాజాగా మొరగదాస్ ,  శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా మదరాసి అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలలో భాగంగా మురగదాస్ మాట్లాడుతూ ... తమిళ సినిమా పరిశ్రమ నుండి 1000 కోట్ల సినిమాలు రాకపోవచ్చు. కాకపోతే మేము ఎంతో సందేశాత్మకమైన సినిమాలు , ఎంతో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు ఇస్తున్నాము అని కామెంట్ చేశాడు.

దీనిపై అనేక మంది అనేక రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా మురగదాస్ రూపొందించిన మదరాసి సినిమా విడుదల అయింది. ఇక ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు మురగదాస్ "మదరాసి" సినిమాతో అంతలా ఏం మెసేజ్ ఇచ్చాడు. గజిని సినిమాలో హీరోకు ఉన్న జబ్బును కాస్త అటు ఇటు చేసి మదరాసి సినిమాలో శివ కార్తికేయన్ కి జోడించాడు. ఈ సినిమా ఫస్ట్ అఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ మాత్రం మరి ఘోరంగా తయారైంది. ఈ సినిమా ప్రేక్షకుడిని ఏ మాత్రం ఆకట్టుకోదు అని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: