ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఒక్కటే మాట వినిపిస్తోంది – ఓజీ.. ఓజీ.. ఓజీ..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ఆత్మీయంగా తీసుకున్న ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్‌తో, భారీఎత్తున అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. అయితే, ప్రత్యేకంగా సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల 40 నిమిషాలకే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం “ఒంటి గంటకే షోలు మొదలు పెట్టాలి” అనే నియమాన్ని పెట్టింది. అయినప్పటికీ, కొంతమంది థియేటర్ యజమానులు తెలంగాణ టైమింగ్స్‌ను ఫాలో అవుతూ, తొలిప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రస్తుతం ఎక్కడ చూసినా జనాల మాటల్లో ఓజీ గురించే వినిపిస్తోంది. ఇలాంటి వేడెక్కిన వాతావరణంలో, సినిమా రిలీజ్ అవ్వకముందే సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా హిట్ అవ్వడం పవన్ కళ్యాణ్‌కి ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. అయితే, ఆయనకంటే కూడా ఈ సినిమా హిట్ అవ్వడం ముగ్గురి కెరీర్‌కి మరింత ఇంపార్టెంట్ గా మారిపోయింది. ఆ ముగ్గురు మరెవరో కాదు – సినిమా దర్శకుడు సుజిత్, హీరోయిన్ ప్రియాంక మోహన్, నిర్మాత దానయ్య. వీళ్లకు ఇది నిజంగా “చావో రేవో” అన్నట్టుగా మారింది.



ఎందుకంటే, సుజిత్ ఇప్పటికే “సాహో” సినిమా ద్వారా భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు . కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఫలితంగా ఆయన కెరీర్‌లో పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు ఆయనకు లభించిన రెండో పెద్ద అవకాశం “ఓజీ”. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ కోసం బాగా కష్టపడి ఈ సినిమా తీశాడని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్టేజ్‌పైకి వచ్చిన క్షణాలు చూసిన వారు, “సుజిత్ ఏదో గట్టి ప్లాన్‌తో వచ్చాడు” అని చర్చించుకుంటున్నారు.



ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ విషయానికి వస్తే, ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలు చిన్న స్థాయి ప్రాజెక్టులే. కానీ పవర్ స్టార్ వంటి బిగ్ స్టార్ సరసన నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆమె భవిష్యత్తు కోసం కీలకం. “ఓజీ” హిట్ అయితే ఆమెకు తప్పకుండా మరిన్ని పెద్ద అవకాశాలు దక్కుతాయి. నిర్మాత దానయ్య విషయానికి వస్తే, ఆయన ఇప్పటికే పలు పెద్ద సినిమాలు నిర్మించారు కానీ ఇటీవల కొన్నింటి ఫలితాలు ఆశించినంతగా రాలేదు. ఇప్పుడు ఈ సినిమానే ఆయనకి మళ్లీ పరిశ్రమలో బలమైన స్థానం తీసుకురావాలి. అందుకే ఈ సినిమా హిట్ ఆయనకి కూడా అత్యంత కీలకం. ఇలా చూసుకుంటే, పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ పక్కన పెడితే కూడా, ఈ సినిమా విజయమే ఆ ముగ్గురి కెరీర్‌లకు నూతన ఊపిరి పోసేలా మారింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. “ఓజీ” హిట్ అయితే వీళ్ళ కెరీర్‌లకు టర్నింగ్ పాయింట్ అవుతుంది, లేకపోతే ట్రోలింగ్, నెగిటివ్ క్యాంపెయిన్ వల్ల వారి వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుంది“ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి, సినిమా ఎలాంటి స్థాయిలో హిట్ అవుతుందో చూద్దాం!”

మరింత సమాచారం తెలుసుకోండి: