
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'ఓజీ' (OG). ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా ప్రీమియర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్లు ప్రదర్శితం కానున్నాయి. కానీ, ప్రీమియర్ టికెట్ రేట్లు, షోల విషయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఓజీ ప్రీమియర్ టికెట్ ధర రూ. 1000 గా నిర్ణయించారు. దీనికి భిన్నంగా తెలంగాణలో మాత్రం ప్రీమియర్ టికెట్ ధర రూ. 800 గా ఉంది. ఏపీలో ఇప్పటికే ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. ఇది ఓజీ అభిమానుల్లో కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది.
తెలంగాణలో మిడ్ నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి లభించడం కష్టం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సమస్య లేదు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు స్పెషల్ షోలకు అనుమతి సులభంగానే వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, ప్రస్తుతానికి మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోల విషయంలో ఓజీ మేకర్స్ వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ నిర్ణయం వల్ల సినిమా మేకర్స్‌కు కోట్లలో నష్టం వాటిల్లుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అభిమానుల అంచనాలను అందుకునేలా మేకర్స్ ఈ నిర్ణయంలో మార్పు చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.
ఓజీ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డ్ క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసే సంచలనాలు మాములుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.