పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఓజి. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నటి రోజున ట్రైలర్ విడుదల చేయగా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించగా, విలన్ గా ఇమ్రాన్ హస్మి నటిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో పవన్ అభిమానులకు ఒక పెద్ద షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డు ఈ సినిమాకి "A"  సర్టిఫికెట్ ని జారీ చేసింది. అంటే ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అని అర్థము. ఈ సినిమాలో ఉండే విపరీతమైన వైలెన్స్ వల్ల ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుసింది. సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే 154.15 నిమిషాలు (అంటే 2 గంటల34 నిమిషాల 15 సెకండ్లు) వాస్తవంగా ఒరిజినల్ రన్ టైమ్ 156.10 సెకండ్లు ఉండగా.. సెన్సార్ బోర్డు సూచించిన ప్రకారం కొన్ని మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో స్మోకింగ్ సీన్స్, డిస్యిక్లయియర్  ప్రదర్శనతో పాటుగా వాయిస్ ఓవర్ ఇవ్వడం వంటి సూచనలతో ఇందులో కొన్ని హింసాత్మకమైన సన్నివేశాలను సెన్సార్ బోర్డు కట్ చేసినట్లు తెలుస్తోంది.


అలాగే ఈ సినిమా ప్రీమియర్ షో కి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. తెలంగాణలో ఈ నెల 24 నుంచి రాత్రి 9 గంటలకే ప్రీమియర్ షో ఉంటుంది. ఏపీలో 25వ తేదీన 1AM షోని క్యాన్సిల్ చేసి 24వ తేదీన రాత్రి 10 గంటలకి ప్రీమియర్ షో ఉండేలా నిర్ణయించుకున్నారు. ఇక అలాగే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇప్పటికే ఓజి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: