ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఓజీ ఒకటి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై, ప్రేక్షకులనుంచి మంచి స్పందనను పొందింది. అయితే, ట్రైలర్ చూసిన కొంతమంది ప్రేక్షకులు, ఈ సినిమాపై ఇంతకు ముందు ఉన్న అంచనాలు కొంత తగ్గాయని వ్యాఖ్యానించారు.

అయితే, దర్శకుడు సుజీత్ ఈ సినిమా విషయంలో ట్రైలర్ రిలీజ్ చేయకుండానే సినిమాను విడుదల చేయాలనుకున్నారని సమాచారం. ఈ విషయం పట్ల కొందరు దర్శకుడి ఆలోచన కరెక్టేనని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ట్రైలర్ రిలీజ్ చేయకపోయుంటే, సినిమాపై ఇంతకు ముందు ఉన్న అంచనాలు ఇంకా పెరిగేవి, థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయే అవకాశం ఉండేది.

ఏది ఏమైనా, సినిమా విడుదలయ్యాకనే దాని విజయం గురించి చెప్పగలం. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్, అలాగే సుజీత్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు, ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓజీ సినిమా  బుకింగ్స్ విషయంలో సంచలనాలను క్రియేట్ చేస్తోంది. కొన్ని థియేటర్లలో బుకింగ్స్ కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. ఓజీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ఓజీ సినిమా ఫుల్ రన్  లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.  ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

og