
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఎవ్వరు టచ్ చేయని కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. అట్లీ తన స్టైల్‌లో మాస్, ఎమోషన్, యాక్షన్ — ఈ మూడు అంశాలను మిక్స్ చేసి విజువల్ స్పెక్టాకిల్‌గా తెరకెక్కిస్తున్నాడట. అల్లు అర్జున్ ఈ సినిమాలో మూడు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నారని, ప్రతి లుక్ ఒక్కో రేంజ్‌లో హైలెట్ అవుతుందని సమాచారం. ఇంతటితో ఆగకుండా, మొత్తం ఐదు మంది హీరోయిన్‌లతో అల్లు అర్జున్ రొమాన్స్ చేయబోతున్నారట. ప్రతి హీరోయిన్ పాత్ర కథలో కీలకమైన టర్న్ తీసుకువస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించేలా, థియేటర్లలో అరుపులు, కేకలు తెప్పించేలా ఉండబోతోందని టాక్ ఇప్పటికే వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. అల్లు అర్జున్ స్వయంగా అట్లీని సంప్రదించి — సినిమా లో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేయాలని కోరాడట. దీనికి అట్లీ కూడా వెంటనే ఓకే చెప్పి, ఆ సాంగ్ కోసం సూపర్ గ్లామరస్ బ్యూటీని ఫిక్స్ చేశాడట. ఆ అందాల తార మరెవరో కాదు — నోరాఫతేహి. తనదైన గ్లామర్, డ్యాన్స్, ఎనర్జీతో అభిమానులను ముగ్ధులను చేసే నోరాఫతేహి — బన్నీతో కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో చిందులు వేయబోతుందట. ఈ న్యూస్ బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం థియేటర్లలో సీట్లు ఊగిపోతాయి, అభిమానులు అరుపులతో, కేకలతో రచ్చరంబోలా చేసేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బన్నీ స్టైల్, నూరాఫతేహి అందాలు, అట్లీ డైరెక్షన్ — ఈ త్రివేణి సంగమం స్క్రీన్‌పై పూనకాల తుఫాను తెప్పించబోతోందనే టాక్ హాట్‌గా వినిపిస్తోంది. మొత్తానికి, ఈ కాంబినేషన్ — “బన్నీ + అట్లీ = పూనకాల తుఫాన్” అని చెప్పడం అతిశయోక్తి కాదు. అభిమానులు ఇప్పటికే “ఇదే ఇండియన్ సినిమా నెక్స్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందా?” అంటూ సోషల్ మీడియాలో హైప్ పెంచేస్తున్నారు!