దసరా సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది. ఒకే వారం మూడు పెద్ద సినిమాలు థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలయ్యాయి — పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1, మరియు ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కొట్టు. ఈ మూడు సినిమాలు విభిన్న జానర్స్‌లో, విభిన్న అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఏమిటంటే — ఈ దసరా అసలైన విజేత ఎవరు?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఓజీ :

పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను దసరా గిఫ్ట్‌గా భావిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. పవన్ స్టైల్, యాక్షన్, డైలాగ్ డెలివరీ – అన్నీ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి కొత్త ఊపునిచ్చింది. ప్రతి సీన్‌లో పవన్ ఎనర్జీ స్క్రీన్ మీద విరజిమ్మింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు సాధించి, తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయిని సృష్టించింది. సినీ విమర్శకులు కూడా ఓజీని పవన్ కెరీర్ బెస్ట్ సినిమాగా పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో "పవన్ రాకింగ్ రీ-ఎంట్రీ!" అంటూ అభిమానులు పూనకాలు తెప్పిస్తున్నారు.



రిషబ్ శెట్టి – కాంతారా చాప్టర్ 1:

కాంతార తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి మరోసారి తన మార్క్ చూపించాడు. కాంతారా చాప్టర్ 1 సినిమాతో మానవుడు-ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటన ప్రశంసలు అందుకుంటోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. రిషబ్ డైరెక్షన్, విజువల్ ప్రెజెంటేషన్, సౌండ్ డిజైన్ – అన్నీ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. కన్నడ సినిమాగా వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే భాష పరమైన లిమిటేషన్స్ వల్ల ఓజీ లాంటి మాస్ కలెక్షన్లు సాధించలేకపోయింది. కానీ కంటెంట్ పరంగా మాత్రం చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు.



ధనుష్ – ఇడ్లీ కొట్టు :

ధనుష్ ఎప్పటిలాగే మరోసారి తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా ఓ సాధారణ కాన్సెప్ట్‌ను ఎంతో హృదయాన్ని తాకేలా చూపించింది. తండ్రి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగ బంధం, విలువల మధ్య వ్యత్యాసం – ఇవన్నీ సినిమాలో చక్కగా నెరిపారు. అయితే బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా అంత పెద్ద హిట్ కాలేకపోయింది. కానీ “గుడ్ మూవీ” అనే పేరు మాత్రం సంపాదించుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ధనుష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి, దసరా విన్నర్ ఎవరు? అంటే మాత్రం జనాల ఆన్సర్ వేరే గా ఉంది. మూడు సినిమాలు వేర్వేరు రేంజ్‌లలో సక్సెస్ సాధించాయి.  బాక్సాఫీస్ రికార్డుల ప్రకారం చూస్తే – ఓజీ స్పష్టమైన విన్నర్. కంటెంట్ పరంగా, క్రాఫ్ట్ పరంగా చూస్తే – కాంతారా చాప్టర్ 1కు ఎక్కువ మార్కులు. ఫ్యామిలీ డ్రామా లవర్స్‌కి – ఇడ్లీ కొట్టు ఒక భావోద్వేగ సినిమా. అయితే సోషల్ మీడియాలో, థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఫెస్టివల్ చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది — ఈ దసరా నిజమైన విన్నర్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ అని అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: