
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చైతూ తాను అభిమానించే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి మైథాలాజికల్ సినిమాలు చేయాలని చెప్పాడు. “అన్నమయ్య సినిమాలో నన్ను ఊహించలేరు, కానీ మైథాలాజికల్ సినిమాలు చేయొచ్చు. ఇటువంటి కథలు ఇటీవల మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. రామాయణం, మహాభారతం లాంటి ఇంతిహాసాల ఆధారంగా సినిమాలు రూపొందించడానికి మేకర్స్‌కి ఉత్సాహం ఉంది” అని చైతూ ప్రకటించాడు. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో ఓ మైథాలాజికల్ థ్రిల్లర్‌పై పని చేస్తున్నాడు. ఇది చైతూ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం. బి.వి.ఎన్.ఎస్. ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. కథానాయికగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇది కాకుండా, చైతూ విక్రమ్ కె.కుమార్ దార్శకత్వంలో ‘దూత 2’ అనే ప్రాజెక్ట్‌లో కూడా భాగం. అదే సమయంలో కొత్త దర్శకులతో టచ్‌లో ఉండి, విభిన్న కథలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. త్వరలో చైతూని కొత్త సినిమా కోసం ఒక ప్రత్యేక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి, నాగచైతన్య కెరీర్ విభిన్నత, సాహసానికి ఒక నిరంతర ప్రయాణం. ప్రేమ కథలలో ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించాక, ఇప్పుడు మైథాలాజికల్, థ్రిల్లర్, ఎపిక్ ప్రాజెక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అభిమానులు ఇప్పుడు కొత్త చైతూ, కొత్త కథల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.