టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటిస్తోంది. తాజాగా సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కాంబినేషన్లో వస్తున్న చిత్రం తెలుసు కదా. ఈ చిత్రాన్ని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన మొదటిసారిగా డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం పాల్గొన్నారు.


అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా ప్రేమకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.. ముఖ్యంగా తాను తన జీవితంలో రెండుసార్లు ప్రేమలో పడ్డానంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అది సినిమాలలోకి రాకముందు ఒకసారి సినిమాలలోకి వచ్చిన తర్వాత ప్రేమలో ఉన్నానంటూ తెలిపింది. ఈ సందర్భంగా రాశి ఖన్నా మాట్లాడుతూ.. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. నాకు కూడా ప్రేమ అనుభవాలు ఉన్నాయని, నా లైఫ్ లో రెండుసార్లు ప్రేమలో ఉన్నాను ఒకటి సినీ ఇండస్ట్రీలోకి రాకముందు, మరొకటి సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంటూ వెల్లడించింది.


అయితే ఇప్పటికీ రాశి ఖన్నాప్రేమ బంధాన్ని కొనసాగిస్తుందా? లేదా అనే విషయాన్ని,అతని పేరుని  మాత్రం చెప్పలేదు. కానీ తాను అయితే ప్రేమలో ఉన్నాననే హింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. తెలుసు కదా సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు. రాశి ఖన్నా సినీ కెరియర్ విషయానికి వస్తే 2013లో మొదటిసారిగా హిందీ సినిమా మద్రాసు కేఫ్ తో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి కామియో పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి జిల్, జోరు, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, ఆక్సిజన్ తొలిప్రేమ, తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: