టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . తాజాగా ఓ జి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్ . ఇక ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు . ఇక పవన్ కళ్యాణ్ బయట ఎంత పవర్ స్టార్ అయినప్పటికీ .. బయటకి వెళ్ళినప్పుడు చాలా మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటాడు .


ఇదే విషయాన్ని తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతా వెల్లడించింది . ఏ మాయ చేసావే మూవీ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అనంతరం అనేక సినిమాల్లో నటి సీతానదైన సత్తా చాటింది . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరమైనప్పటికీ ఈమె పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు . ఇక సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . " నేను పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించాను . ఈ మూవీ కోసం మేము స్విట్జర్ ల్యాండ్ వెళ్ళాం .


ఇక అక్కడ ఓ సాంగ్ షూటింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా సిగ్గు పడడం జరిగింది . అక్కడ జనాలు ఉన్నారు నేను చేయలేను అని కారవాన్ లోకి వెళ్ళిపోయారు . నువ్వు చెయ్యగలవు యు కం అని చెప్పారు . నేను చేయాలంటారా అని పవన్ కళ్యాణ్ అడగడం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది . అంత పెద్ద పవర్ స్టార్ అయినప్పటికీ కూడా ఇంత సింపుల్గా ఎలా ఉంటున్నారు అనుకున్నాను . ఆయన బయటకు అలా కనిపిస్తారు కానీ పది మందిలో ఏదైనా చేయాల్సి వస్తే చాలా సిగ్గుపడతారు " అంటూ కామెంట్స్ చేసింది సమంత . ప్రజెంట్ సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: