ప్రముఖ తెలుగు యాంకర్లలో ఒకరైన లాస్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . తాజాగా యాంకర్ లాస్య కొత్త ఇంటి కలను నెరవేర్చుకుంది. ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది కూడా . బంధుమిత్రులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది . వారిలో నైనీ పావని మరియు బంచిక్ బబ్లు , రీతు రాయల్ , దేత్తడి హారిక తదితరులు హాజరయ్యారు . ఇక లాస్య గృహప్రవేశానికి వెళ్ళిన వారు ఆమె ఇల్లు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు కూడా .  


లాస్య ఫ్రెండ్ నోయెల్  అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు . " నా ఇల్లు చూసే నువ్వు కచ్చితంగా కుళ్ళు కుంటావు " అని ఈ లాస్య అంది . నిజంగానే ఇల్లు చూశాక నేను జలసీగా ఫీల్ అయ్యాను . ఇల్లు ఇంత బాగుంది . ఆ దేవుడు మీకు జంటను ఎప్పుడూ ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అంటూ ఫోటోలను షేర్ చేశాడు . ఇక ఇది చూసిన అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . బుల్లితెరలు యాంకర్ గా ఓ వెలుగు వెలుగు నా ఈ ముద్దుగుమ్మ అనంతరం బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది .


ప్రజెంట్ బుల్లితెర కార్యక్రమానికి హాజరైతు తనదైన రీతిలో సందడి చేస్తుంది . ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది . ఇక ఈ సమయంలోనే లాస్య మరియు దేత్తడి హారిక అదే విధంగా నోయెల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు . ఇకపోతే పేరెంట్స్ కోసం గతంలో ఇల్లు కట్టించిన లాస్య నాలుగు నెలల కిందట తండ్రికి మంచి కారును కూడా . ప్రెసెంట్ తాను కూడా ఇల్లును నిర్మించుకుని ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: