-  టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నవదళపతి సుధీర్ బాబు మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ మూవీ జటాధర నుంచి ప్రమోషనల్ సాంగ్ “ట్రెండ్ సెట్ చెయ్ ” రిలీజ్ అయింది. ఇన్స్టంట్ గా ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఎంటర్‌టైనింగ్ బీట్స్, కలర్ఫుల్ విజువల్స్, సుధీర్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో పాట మంచి వైబ్ క్రియేట్ చేస్తోంది.రీస్ & జైన్ - సామ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్‌ఫుల్ ఎనర్జీతో అదిరిపోయింది. లిరిసిస్ట్ శ్రీమణి తెలుగుతో ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ, ఆకట్టుకునే వర్డ్ ప్లేతో సాంగ్‌ను ట్రెండీగా రాశారు. జితేందర్ ,రజీవ్ రాజ్ వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీ ఇచ్చారు  


స్టైలిష్ పబ్ సెట్‌లో తెరకెక్కిన వీడియోలో సుధీర్ బాబు, శ్రేయా శర్మతో కలసి స్టైలిష్ మూవ్స్ చూపిస్తూ అదరగొట్టారు. స్మార్ట్ కొరియోగ్రఫీ, కూల్ వైబ్‌తో ట్రెండ్ సెట్ చెయ్య్ నిజంగానే టైటిల్‌కి తగ్గట్టే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. జీ స్టూడియోస్, ప్రేరణ .. అరోరా నిర్మిస్తున్న ఈ మిథాలజికల్ స్పెక్టాకిల్‌లో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తొలిసారి .. తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా తో సుధీర్ బాబుకు చాలా రోజు ల త‌ర్వాత సోలో హిట్ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: