
ఇప్పటికే పెద్ది సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన రామ్ చరణ్ కి కూడా చాలానే నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ అదే రేంజ్ లో ఉండేలా మరొక సినిమాని ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. ఆ చిత్రం ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తో చేయబోయే సినిమానే. ఇది కూడా పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే విషయంపై అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే సుకుమార్ పుష్ప 3 సినిమా పైన అప్డేట్ ఇవ్వడంతో పుష్ప 3 సినిమా అయిపోయిన తర్వాతే ఈ సినిమా ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ సినిమా గురించి ఒక కీలకమైన అప్డేట్ ఇస్తూ మైత్రి మూవీ నిర్మాతలలో ఒకరైన నిర్మాత నవీన్ మాట్లాడారు. సుకుమార్ గారి తదుపరిచిత్రం పుష్ప 3 కాదని, రామ్ చరణ్ గారితోనే ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. పెద్ది సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ గారి సినిమా మొదలవుతుందని అది కూడా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో మొదలవుతుందంటూ తెలిపారు. ఈ విషయం విన్న మెగా అభిమానులు ఆనందంలో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు కొంతమేరకు నిరాశపడుతున్నారు