తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ తాజాగా డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూవీ కి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 1.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 42 లక్షలు , ఆంధ్ర లో 1.73 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.95 కోట్ల షేర్ ... 7.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 7.05 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి భారీ ఎత్తున రెండు రోజుల్లో కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో తగ్గలేదు. అందుకు ప్రధాన కారణం ఈ సినిమాతో పాటు మరో కొన్ని సినిమాలు విడుదల కాపడం , వాటికి కూడా మంచి టాక్ రావడంతో ఈ మూవీ కి అనుకున్న స్థాయి కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కడం లేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: