టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటించి క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి. గతంలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన ప్రియమణి ఈమధ్య పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దక్షిణాది సినిమాల పైన పాన్ ఇండియా స్థాయిలో పెరుగుతున్నటువంటి క్రేజ్ పైన తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఒకానొక సమయంలో దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది అంటూ తెలియజేసింది.


ప్రాంతీయ భాష సినిమాలు ఇప్పుడు అన్ని వయసుల ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయని మంచి సినిమాలు ఎప్పటినుంచో వస్తున్నాయి కానీ గతంలో వాటికి పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు.. ఇప్పుడు ఓటీటిలలో అన్ని భాషలలో సినిమాలు విడుదలవుతున్నాయి, నటీనటులకు పాత్ర నచ్చితే భాషతో సంబంధం లేకుండా నటించడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో అన్ని భాషల వారిని దక్షిణాది చిత్రాలు మెప్పిస్తున్నాయి. మన సినీ పరిశ్రమే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమంటూ తెలియజేసింది ప్రియమణి. రాబోయే రోజుల్లో ప్రాంతీయ సినిమాలు మరియు హిందీ సినిమాల మధ్య ఉన్న అడ్డగోడలు కూడా నెమ్మదిగా తొలగిపోతాయంటూ తెలిపింది.


 దక్షిణాది సినిమాల ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో పరిశ్రమలో కూడా కొత్త కొత్త అవకాశాలు , పాన్ ఇండియా ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా చేస్తున్నాయంటూ తెలిపింది. ప్రియమణి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జననాయగన్, G.D. N , సరస్వతి వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈమధ్య తెలుగు, తమిళ వంటి భాషలలో కూడా అద్భుతంగా నటిస్తోంది ప్రియమణి. అలాగే బుల్లితెర పైన కూడా పలు షోలలో జడ్జిగా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: