సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే, చాలా మందికి వెంటనే గుర్తుకువచ్చేది స్టార్ హీరోల హవా. బాక్స్ ఆఫీస్ దగ్గర నుండి సోషల్ మీడియా వరకు, స్టార్ హీరోలకే అన్ని లైమ్‌లైట్ అన్న భావన చాలా కాలంగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నింటినీ మార్చేస్తూ, స్టార్ హీరోలతో సమానంగా కాకుండా, కొన్నిసార్లు వారిని మించి సత్తా చాటుతున్న ఒక స్టార్ హీరోయిన్ పేరు అందరి నోటా మార్మోగుతోంది – ఆమె మరెవరో కాదు, మన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న . రష్మిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన చిరునవ్వుతోనే కోట్లాది హృదయాలను గెలుచుకున్న ఈ నేషనల్ స్టార్ హీరోయిన్, ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రాముఖ్యమైన పేర్లలో ఒకటిగా నిలిచింది.
 

తాజాగా “ది గర్ల్ ఫ్రెండ్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె అద్భుతమైన లుక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ ఈవెంట్‌లో రష్మిక అందం, ఆత్మవిశ్వాసం, మరియు ఎలిగెన్స్ చూసి అందరూ ఒకే మాటలో – “ఇదే స్టార్ రేంజ్!” అని మెచ్చుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక పేరు మారు మ్రోగిపోతోంది. కారణం – ఆమె సినీ ప్రయాణం. రష్మిక మందన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ తొమ్మిదేళ్లలో ఆమె నాలుగు భాషల్లో – తెలుగు, తమిళం, కన్నడ, మరియు హిందీ – మొత్తంగా 25 సినిమాలలో నటించింది. వాటిలో కొన్ని సూపర్ హిట్, కొన్ని యావరేజ్, మరికొన్ని ఫ్లాప్ అయినా, ఆమె క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.



ప్రస్తుతం రష్మిక రేంజ్ ఒక స్టార్ హీరో రేంజ్‌తో సమానంగా ఉంది. వాస్తవానికి ఇప్పుడు ఆమెకు ఉన్న మార్కెట్, డిమాండ్, మరియు ఫాలోయింగ్ చాలామంది స్టార్ హీరోలకంటే ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఆమె చాకచక్యంగా ఎంచుకునే కథలు, ప్రతి సినిమాలో చూపించే కొత్త షేడ్స్.“పుష్ప”, “పుష్ప 2”, “అనిమల్”, “కుబేర” వంటి భారీ బడ్జెట్ సినిమాలలో నటించి రష్మిక తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా “పుష్ప 2” మరియు “అనిమల్” సినిమాలు 1000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటడంతో, రష్మిక పేరు బాక్స్ ఆఫీస్‌లో గ్యారంటీగా మారిపోయింది. ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు రష్మికను సైన్ చేసుకోవడం అంటే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇదంతా చూసి సోషల్ మీడియాలో అభిమానులు రష్మికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇంతవరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే సాధ్యమయ్యే ఫీట్‌ను ఇప్పుడు రష్మిక సాధించింది.” “రష్మిక ఇప్పుడు హీరోయిన్ కాదు, ఒక బ్రాండ్.” “హీరోల క్రేజ్ ఏదైనా ఉండొచ్చు, కానీ రష్మిక క్రేజ్ వేరే లెవెల్.” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: