టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఎన్నో వైవిద్యమైన పాత్రలలో ప్రేక్షకులను బాగా అలరించారు. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ అంశంగా వస్తున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందుకు సంబంధించి నిన్నటి రోజున ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా పెద్ది సినిమా నుంచి మరొక గుడ్ న్యూస్ అందుతోంది వాటి గురించి చూద్దాం.


పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈనెల ఆరవ తేదీన అంటే గురువారం పెద్ది సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయబోతున్నట్లు వినిపిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే సాంగ్ కూడా సిద్ధం చేసింది చిత్ర బృందం. ఇక హీరోకు వినిపించిన తర్వాత అనుమతి తీసుకొని మరి విడుదల చేయబోతున్నారు. వాస్తవంగా దసరా కానుక గా ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన కొన్ని కారణాల చేత వాయిదా పడిందట. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ పెద్ది సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ని లైవ్ పెర్ఫార్మషన్స్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి.


పెద్ది సినిమాని రామ్ చరణ్ బర్తడే సందర్భంగా మార్చి 27న వచ్చే యేడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన పెద్ది ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేసేలా చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు విజయ్ చంద్రశేఖర్ తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు. మరి మొత్తానికి ఫస్ట్ సింగిల్ అభిమానులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: