తక్కువ టైంలోనే బాలీవుడ్లో క్రేజీ హీరోగా మారిపోయాడు టైగర్ ష్రాఫ్. సీనియర్ హీరో జాకీష్రాప్ తనయుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన టైగర్ సినిమాల ద్వారా ఎలా పాపులర్ అయ్యాడో ? బయట విషయాల్లోనూ అంతే పాపులర్ అయ్యాడు. అమ్మాయిలతో ఎఫైర్లు కూడా అతడిని మీడియాలో బాగా నాన్చాయ్. ఇక మూడేళ్లుగా టైగర్, హాట్ హీరోయిన్ దిశాపటానీ ప్రేమాయణం గురించి నేషనల్ మీడియా కోడై కూసింది.
టైగర్ - దిశా ఎక్కడకు వెళితే అక్కడ కావాల్సినన్ని వార్తలు. వీళ్ల హాట్ హాట్ ఫొటోలతోనే మ్యాగజైన్లు దర్శనమిచ్చేవి. మూడున్నరేళ్ల ప్రేమాయణానికి వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నట్టు బీ టౌన్లో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ మ్యాటర్ ఈ జంట అధికారికంగానే ధృవీకరించిందని కూడా బీ టౌన్ టాక్. ఎంతో అన్యోన్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లు ఎందుకు ? విడిపోతున్నారన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్.
దిశాతో ఎఫైర్ టైగర్‌ష్రాప్ తల్లికి ఏ మాత్రం ఇష్టం లేదట. అలాంటి అమ్మాయిని ఇంటి కోడలిగా తీసుకువస్తావా ? అని టైగర్ తల్లి సీరియస్ అవ్వడంతో చివరకు మూడున్నరేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు ఎప్పుడైనా బ్రేకప్ చెప్పుకోక తప్పదని... ఇప్పుడే విడిపోయారని అంటున్నారు.
ఈ గ్యాప్ కొద్ది రోజుల నుంచే వచ్చేసిందట. టైగర్ ఇతర ఎఫైర్లు దిశాకు నచ్చకపోవడం... ఇటు దిశా ఇటీవల పొలిటికల్ యంగ్ లీడర్ ఆదిత్య థాక్రేతో క్లోజ్‌గా మూవ్ అవుతుండడం కూడా దిశ - టైగర్ మధ్య గ్యాప్‌కు కారణాలుగా బీ టౌన్ మీడియా రాసింది. ఏదేమైనా ఈ హాట్, క్రేజీ జంట బ్రేకప్ ఇప్పుడు బీ టైన్లో సంచలనంగా మారింది. కెరీర్ పరంగా చూస్తే టైగర్ ష్రాఫ్ .. దిశా ఇద్దరూ ఎవరికి వారు బిజీ బిజీగా ఉన్నారు.