సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం..ఇక్కడ ఒక్కసారి ఎంట్రీ ఇస్తే చాలు లైఫ్ మొత్తం టర్నింగ్ అవుతుందని అనుకుంటారు.  ఇక వెండితెరపై తమను తాము ఒక్కసారి చూసుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని భావించే వారు చాలా మంది ఉన్నారు.  ఒక్కసారి సెలబ్రెటీ అయితే చాలు వేలల్లో ఒక్కరం..సొసైటీలో ఎంతో గౌరవం..లగ్జరీ లైఫ్ అన్నీ అనుభవించవచ్చు అనే భావన ఉంటుంది.  అయితే హీరో, హీరోయిన్లు కాదు కదా చిన్న క్యారెక్టర్ వేషం దొరకడం కూడా అదృష్టం, లాటెంట్ ఉండాలి.  ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నత స్థానంలో ఉన్న నటీనటులు ఎంతో కష్టపడితే కానీ గొప్ప స్థానంలోకి రాలేదు.  
Image result for bhavana rape
ఇక సినిమా ఇండస్ట్రీలోకి కాలు పెట్టాలంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో కాస్తో కూస్తో పరిచయం ఉంటేనో..లేదా నటీ నటులు కు వారసులు అయితేనో ఆ అదృష్టం దక్కడం లేదు.  ఇక సినిమాల్లో నటించాలని ప్రతిరోజు భారత దేశంలో స్టూడియోల వెంట వేల మంది తిరుగుతూనే ఉన్నారు.  స్టూడియోల వద్ద ఉండే బ్రోకర్లకు డబ్బులు సమర్పించుకోవడంతో పాటు అమ్మాయిలు అయితే తమ శీలాన్ని కూడా సమర్పించుకునే పరిస్థితి దాపురించింది.  ఇలాంటి సంఘటనలు రోజుకి ఎన్నో చూస్తుంటాం..అయితే హీరోయిన్లుగా రావడానికి కూడా కొంత మంది తమ జీవితాన్ని రిస్క్ లో పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి.
Image result for kasturi hot
 ఆ మద్య బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాను సినిమాలోకి వచ్చే సమయంతో తనకు చాన్సు లు ఇప్పిస్తామని లైంగికంగా వాడుకున్నారని డైరెక్టర్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది.  ఇక అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ తన టీనేజ్ వయసులు ఓ వ్యక్తి తాకరాని చోటు తాకి బలవంతం చేశాడని చెప్పింది. ఇక ఈ మద్య మళియాల నటి భావన కు జరిగిన అన్యాయం యావత్ భారత దేశానికి తెలుసు.  ఆమె డ్రైవర్ కొంత మందితో కలిసి కారులో బందించి న్యూడ్ ఫోటోలు తీసి లైంగికంగా వేధించినట్లు పెద్ద దుమారమే చెలరేగింది.  
Image result for swatha prasad
మొత్తానికి ఆ కామాంధులకు జైలు శిక్షపడ్డా భావన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది హీరోయిన్లు తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగానే చెప్పుతూ వచ్చారు.  శరత్ కూమార్ కూతరు వరలక్ష్మి ఓ టీవీ చానల్ ప్రోగ్రామ్ తనను పడక సుఖం కోసం అడిగాడని తాను చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చానని ట్విట్ చేసింది.  ఇక రెజీనా కూడా తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లైంగికంగా వేధించబడ్డానని స్టేట్ మెంట్ ఇచ్చింది.  తాజాగా మరో నటి కస్తూరి కూడా ఏకంగా ఓ హీరో తన వాంఛలు తీర్చాలని బలవంతం చేశాడని ఒప్పుకోకపోవడంతో రెండు సినిమాలు క్యాన్సల్ చేశాడని వాపోయింది.
Image result for sukanya prostitution
ఇక కొంతమంది నటీమణులు లగ్జరీ జీవితాలకు అలవాటు పడి చేతిలో సినిమాలు లేకపోతే  వేశ్యావృత్తిని ఎన్నుకుని చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు.   మంచి ఫామ్ లో ఉన్న శ్వేతాబసు కూడా వ్యభిచార కేసులో పట్టుండింది. ఇలాంటి హైటెక్ వ్యభిచారంలో పలువురు వెండితెర, బుల్లితెర నటీమణులు పట్టుబడ్డ వైనం అందరికీ తెలిసిందే.  ఏది ఏమైనా రంగుల ప్రపంచంలో నటించే నటీమణుల వేనుక కూడా ఎన్నో దీన గాధలు ఉన్నాయని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: