తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ సినిమాతో స్టార్ హోదా అందుకున్నాడు. డార్లింగ్, మిర్చి లాంటి సినిమాలతో మంచి హీరోగా పేరు పొందిన ప్రభాస్ మరోసారి రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ వివాహ బాధ్యతలు ఆయన పెదనాన్న కృష్ణం రాజు తీసుకున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.
కాగా బాహుబలి చిత్రం తర్వాత తన వివాహం జరిగే యోచనలో ఉన్నట్లు కృష్ణం రాజు తెలిపారు. బాహుబలి సినిమా తీయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. బాహుబలి సినిమా ప్రపంచ స్థాయిలో అలరించిన విషయం తెలిసిందే..అయితే మొదటి పార్ట్ విడుదలయిన వెంటనే రెండవ పార్ట్ షూటింగ్లో ప్రభాస్ పడ్డాడు. ఇక రెండవ పార్ట్ ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత కూడా ప్రభాస్ పెళ్లి చేసుకునేట్లుగా కనిపించడం లేదు.
తాజాగా ‘బాహుబలి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ తన పెళ్లి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా మీ పెళ్లి విషయం వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా వ్యక్తి ప్రశ్నించగా, నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే తెలియదు, అసలు ఆ ప్రశ్నకు సమాధానం ఏ ఒక్కరికి తెలియదు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ సంవత్సరం కూడా ఈ బ్యాచ్ లర్ వివాహం అవుతుందా కాదా అన్న ఆలోచనలోనే పడ్డారు ఫ్యాన్స్.