ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలోకి తమిళ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు.  తమిళ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, ధనుష్, సూర్య వీళ్లతో పాటు విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ తో బాగా సక్సెస్ అయ్యాడు. గతంలో  సలీమ్, నకిలీ చిత్రాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.  కానీ బిచ్చగాడు చిత్రం తర్వాత విజయ్ ఆంటోనీ ఇమేజ్ బాగా పెరిగిపోయింది.  ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ త్వ‌ర‌లో ‘కాశి’గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

 కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.   మార్చి 30న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బేనర్ పై నిర్మిస్తుంది. అంజలి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో సున‌య‌న‌, శిల్పా మంజునాథ్‌, అమృత ముఖ్య పాత్ర‌లు పోషించారు. విజ‌య్ ఆంటోని చిత్రానికి సంగీతం అందించారు.

థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో నాలుగైదు గెటప్పుల్లో దర్శనం ఇచ్చి థ్రిల్ చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఒక పాముతో ట్రైలర్‌ను స్టార్ట్ చేయడం..‘అమ్మా.. నీకో విషయం చెప్పనా? నాకెప్పుడూ ఓ కల వస్తుందని చెప్తాను కదా.. ఓ చిన్నపిల్లాడిని ఎద్దు పొడిచినట్టు, పెద్ద పాము వచ్చినట్టు.. నా గత జీవితంతో ఏదో జరిగి ఉంటుందనిపిస్తుంది.

నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో అయి ఉంటుందమ్మా. అదే కల లాగా వస్తుంది.. ఒక్కసారి ఇండియాకి వెళ్లి.. నా చిన్నప్పుడు ఏం అయిందో.. నన్ను కన్నవారు ఎందుకు వద్దనుకున్నారో.. తెలుసుకుని వస్తానమ్మా..’అని చెప్పడం ఇది ఈ మూవీ గత జన్మల నేపథ్యంలో అల్లిన కథా అనే సందేహాలు రాక మానవు. మ‌రోవైపు విజ‌య్ ఆంటోని తెలుగులో రోష‌గాడు చిత్రంతో బిజీగా ఉన్నాడు. గ‌ణేశ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని విజ‌య్ ఆంటోని భార్య ఫాతిమా హోమ్ బేన‌ర్‌పై నిర్మించ‌నుంది. ఈ చిత్రంలో విజ‌య్ ఆంటోని పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: